2026లో ఎనిమిది ప్రాజెక్టులు హ్యాండోవ‌ర్‌

Vasavi Group CMD Erram Vijay Kumar says 8 projects and 8,000 flats will be handed over in 2026 as Hyderabad real estate shows signs of recovery.

Dec 26, 2025 - 01:44
Dec 26, 2025 - 01:51
 0  101
2026లో ఎనిమిది  ప్రాజెక్టులు హ్యాండోవ‌ర్‌
vasavi-group-8-projects-handover-2026-hyderabad
వెల్ల‌డించిన వాస‌వి గ్రూప్ సీఎండీ
ఎర్రం విజ‌య్ కుమార్..


ఆర్ఈజీ న్యూస్‌తో స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూ
8 వేల ఫ్లాట్ల‌ను 2026లో హ్యాండోవ‌ర్ చేస్తాం
2025లో మందకోడిగా మ‌న రియ‌ల్ మార్కెట్‌
కోకాపేట్ వేలంతో పెరిగిన సానుకూల‌త‌


(కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌, 9030034591)

2026లో సుమారు ఇర‌వై మిలియ‌న్ చ‌ద‌ర‌పు అడుగుల నివాస నిర్మాణ స్థ‌లాన్ని హ్యాండోవ‌ర్ చేస్తామ‌ని.. ఇందులో సుమారు ఎనిమిది వేల ఫ్లాట్లు ఉన్నాయ‌ని.. వాస‌వి గ్రూప్ సీఎండీ ఎర్రం విజ‌య్ కుమార్ వెల్ల‌డించారు. 2025లో హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ మార్కెట్ స్థితిగ‌తుల‌పై ఆయ‌న ఆర్ఈజీ న్యూస్‌తో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా త‌ను మాట్లాడుతూ.. 2025లో హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ మార్కెట్ స్త‌బ్దుగా ఉంద‌న్నారు. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ప‌లు ప్రాజెక్టుల నిర్మాణాల్ని అడ్వాన్స్ స్టేజీకి తీసుకెళ్లామ‌ని తెలిపారు. ఇంకా ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే..



అంద‌రికీ తెలిసిన విష‌యం ఏమిటంటే.. 2025లో హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ మార్కెట్ స్త‌బ్దుగా ఉంది. మార్కెట్ మంద‌కోడిగా ఉండ‌టం వ‌ల్ల ఆశించిన మేర‌కు ఫ్లాట్ల అమ్మ‌కాలు జ‌ర‌గ‌లేదు. అయినా కూడా, మా బృందం ఎక్క‌డా అధైర్య‌ప‌డ‌కుండా.. ఎన్ని అవాంత‌రాలొచ్చినా.. వాటిని స‌మ‌ర్థంగా అధిగ‌మిస్తూ.. అధిక శాతం ప్రాజెక్టుల్లో స్ట్రక్చ‌ర్ వ‌ర్క్ పూర్తి చేయ‌గ‌లిగాం. ఫినిషింగ్ చేయ‌డానికి ప్ర‌ణాళిక‌ల్ని ర‌చిస్తున్నాం. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ప‌ది ప్రాజెక్టుల్ని నిర్మిస్తున్నాం. సుమారు నాలుగు కోట్ల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్నాయి. వాస‌వి అర్బ‌న్‌, లేక్‌సిటీ, క్రౌన్ ఈస్ట్‌, స్కై సిటీ, వాట‌ర్ ఫ్రంట్ ట‌వ‌ర్ 1, నంద‌నం, ఆవాసా, స్కైలా వంటి ప్రాజెక్టుల్ని హ్యాండోవ‌ర్ స్థాయికి తీసుకెళుతున్నాం. 2026లో వీటిని కొనుగోలుదారుల‌కు హ్యాండోవ‌ర్ చేయ‌డానికి ప్రణాళిక‌ల్ని ర‌చిస్తున్నాం. ఇందుకు సంబంధించి క్ర‌మం త‌ప్ప‌కుండా మా బృందంతో ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాం. మీరు వింటే ఆశ్చ‌ర్య‌పోతారు.. 2025లో అన్ని ప్రాజెక్టుల్లో క‌లిపి కేవ‌లం ఆరు వేల ఫ్లాట్ల‌ను విక్ర‌యించినా.. నిర్మాణ ప‌నుల్లో మాత్రం ఎక్క‌డా ఆప‌కుండా ముందుకెళుతున్నాం.



* మ‌రి, బాచుప‌ల్లిలో వాస‌వి అర్బ‌న్‌లో బ‌య్య‌ర్లు గొడ‌వ చేయ‌డానికి కార‌ణ‌ముంది. నీటి పారుద‌ల శాఖ కార‌ణంగా రెండు ట‌వ‌ర్ల నిర్మాణ ప‌నులు ఆల‌స్యమ‌య్యాయి. అందుకే, అందులో కొన్న‌వారిలో కొంద‌రు ఆందోళ‌న‌కు దిగారు. అయితే, వారికి విష‌యాన్ని క్లియ‌ర్‌గా వివ‌రించాం. ఆల‌స్యానికి గ‌ల కార‌ణాల్ని తెలియ‌జేశాం. అందులో దాచుకునేది ఏముంది? వాటిని హ్యండోవ‌ర్ చేయ‌డానికి కాస్త ఆల‌స్యమ‌వుతుంది. నిజానికి, వాస‌వి అర్బ‌న్‌కు సంబంధించిన ఇత‌ర ట‌వ‌ర్ల విష‌యానికొస్తే.. షెడ్యూల్ ప్ర‌కార‌మే నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్నాయి. మేం డెవ‌ల‌ప్ చేస్తున్న క‌మ‌ర్షియ‌ల్ స్పేస్ విష‌యానికొస్తే.. ఇప్ప‌టికే వాస‌వి స్కైసిటీ ఫేజ్ వ‌న్‌ను హ్యాండోవ‌ర్ చేశాం. సెకండ్ ఫేజ్ హ్యాండోవ‌ర్ చేయ‌డానికి ప్ర‌ణాళిక‌ల్ని ర‌చిస్తున్నాం. ఇందుకు సంబంధించిన ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. వాట‌ర్ ఫ్రంట్ మొద‌టి ట‌వ‌ర్ కూడా వ‌చ్చే ఏడాది అంద‌జేసే విధంగా ప‌నుల్లో వేగాన్ని పెంచాం.

2026 మార్కెట్ ఎలా ఉంటుంది?
2025 చివ‌రి త్రైమాసికం నుంచి మార్కెట్లో సానుకూల దృక్ప‌ధం ఏర్ప‌డింది. ఇప్ప‌టివ‌ర‌కూ వేచి చూసే ధోర‌ణీని అల‌వ‌ర్చుకున్న వారంతా.. క్ర‌మ‌క్ర‌మంగా ఫ్లాట్ల‌ను కొనుగోలు చేయ‌డం మీద దృష్టి సారించ‌డం మొద‌లెట్టారు. ముఖ్యంగా కోకాపేట్ నియోపోలిస్‌లో వేలం పాట‌లు మార్కెట్‌కు మంచి పాజిటివ్ ఎన‌ర్జీని ఇచ్చాయి. ఎక‌రానికి 130 నుంచి 150 కోట్లు ప‌ల‌క‌డం వ‌ల్ల‌.. ప్ర‌స్తుతం న‌గ‌రంలో నిర్మాణాలు జ‌రుపుకుంటున్న  ప్రాజెక్టుల విలువ కూడా పెరిగిన‌ట్లే క‌దా.. ఈ వేలం పాట‌లు మార్కెట్‌లో మంచి జోష్‌ను నింపాయి. ఆరు నుంచి తొమ్మ‌ది నెల‌ల్లోపు పూర్త‌య్యే ప్రాజెక్టులకు మాత్రం మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. మొత్తానికి, 2026లో హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ మార్కెట్ మెరుగైన ప‌నితీరును ప్ర‌ద‌ర్శించే అవ‌కాశ‌ముంది.

కొత్త ప్రాజెక్టులు!
2026లో సుమ‌ధుర గ్రూప్‌తో క‌లిసి ఒలంప‌స్ ప్రాజెక్టుని హ్యాండోవ‌ర్ చేస్తున్నాం. ఎల్‌బీన‌గ‌ర్ ఆనంద నిల‌యం, కూక‌ట్‌ప‌ల్లిలో స‌రోవ‌ర్ ప్రాజెక్టులు పూర్త‌వ్వ‌డానికి సుమారు రెండేళ్లు ప‌డుతుంది. కూక‌ట్‌ప‌ల్లి శిల్పా లేఅవుట్‌లో ప‌ది ఎక‌రాల్లో కొత్త ప్రాజెక్టును ఆరంభించాల‌నే ఆలోచ‌న‌లున్నాయి. కాక‌పోతే, మార్కెట్ గ‌మ‌నాన్ని బ‌ట్టి తుది నిర్ణ‌యం తీసుకుంటాం.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0