ఇళ్ల అమ్మకాల విలువ రూ.1.52 లక్షల కోట్లు..

India’s real estate in 2025 sets a new record with ₹1.52 lakh crore home sales value and $10.4 billion investments. Hyderabad real estate also sees strong premium growth.

ఇళ్ల అమ్మకాల విలువ రూ.1.52 లక్షల కోట్లు..
india-real-estate-2025-sales-value-1-52-lakh-crore-investments-growth

భారత దేశంలో రియల్ ఎస్టేట్ ట్రెండ్ ఈ ఏడాది 2025లో విభిన్నంగా కొనసాగింది. ఇళ్ల అమ్మకాల సంఖ్య‌ పరంగా తగ్గుదల కనిపించినప్పటికీ, అమ్మకాల విలువపరంగా మాత్రం మార్కెట్ సరికొత్త రికార్డులను సృష్టించింది. 2025లో దేశంలోని ప్రధాన 7 మెట్రో నగరాల్లో ఇళ్ల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే సుమారు 9 నుండి 12 శాతం వరకు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా జనవరి – సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ తగ్గుదల స్పష్టంగా కనిపించింది. అయితే ఇళ్ల అమ్మకాల విలువ మాత్రం.. 14 శాతం పైగా పెరిగి రూ. 1.52 లక్షల కోట్లకు చేరడంతో రియాల్టీ మార్కెట్ కు నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది.

భారత రియల్ ఎస్టేట్ రంగం చరిత్రలో ఈ ఏడాది 2025 ప్రత్యేకమైనదిగా చెప్పుకోవాలి.  ఈ 2025 సంవత్సరంలో దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలోకి ఏకంగా 10.4 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.93,200 కోట్ల పెట్టుబడి వచ్చింది. ఇది 2024లో వచ్చిన పెట్టుబడుల కంటే చాలా ఎక్కువ అని జేఎల్ఎల్ ఇండియా తాజా నివేదిక పేర్కొంది. అంటే 2025లో రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రతిరోజూ సగటున రూ.255 కోట్లకు పైగా పెట్టుబడులొచ్చాయి. భారత రియల్ ఎస్టేట్ మార్కెట్‌ పై సంస్థాగత పెట్టుబడిదారులు చూపిస్తున్న అపారమైన నమ్మకానికి ఇదే నిదర్శనమని నిపుణులు అంటున్నారు. ఇక 2024తో పోలిస్తే ఈ ఏడాది 2025లో ఆఫీస్ స్పేస్ రంగంలో పెట్టుబడులు ఏకంగా రెట్టింపయ్యాయి. మొత్తం పెట్టుబడుల్లో 58 శాతం వాటా ఆఫీస్ స్థలాలదే కావడం గమనార్హం.

* 2025 రియల్ ఎస్టేట్ రంగంలో నగరాల విషయానికి వస్తే 29 శాతం పెట్టుబడులతో సిలికాన్ వ్యాలీ బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ముంబై తన హవాను కొనసాగించింది. కేవలం మెట్రో నగరాలే కాకుండా, టైర్-2 నగరాల్లో కూడా సుమారు 175 మిలియన్ డాలర్ల పెట్టుబడులు రావడం మార్కెట్ విస్తరణను సూచిస్తోంది. పెట్టుబడిదారులు ఇప్పుడు కేవలం ఇళ్లు లేదా ఆఫీసులకే పరిమితం కాకుండా.. కొత్త రంగాల వైపు మొగ్గు చూపుతున్నారు. డేటా సెంటర్లు, స్టూడెంట్ హౌసింగ్, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ ప్రాపర్టీలలో పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయి. స్థిరమైన ఆదాయం, దీర్ఘకాలిక సంపద సృష్టించుకోవడానికి రియల్ ఎస్టేట్ ఇప్పుడు అత్యంత సురక్షితమైన రంగంగా అవతరించింది. విదేశీ పెట్టుబడిదారుల నిరంతర విశ్వాసం, దేశీయ సంస్థల బలం కలిసి భారత రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాయని రియల్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0