ట్రిపుల్ ఆర్ పనులకు టెండర్లు డిసెంబరులోనా?
The Telangana Regional Ring Road (RRR) North Part project is moving fast with Centre approval for converting the Singareni–Rayagiri stretch into a six-lane corridor. NHAI is set to invite tenders in December or January. The 161.5 km RRR North section will cost ₹15,627 crore under the HAM model, boosting connectivity, reducing traffic, and supporting Bhartamala-1 regional development goals.
తెలంగాణకు మరో మణిహారంగా మారనున్న రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి చకచకా అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్ అభివృద్ధిలో అత్యంత కీలకంగా భావిస్తున్న ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం పనులు స్పీడందుకోనున్నాయి. రీజినల్ రింగ్ రోడ్డు నార్త్ భాగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో వచ్చే నెల డిసెంబరు లేదా జనవరిలో టెండర్లు పిలిచేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సిద్దమవుతోంది. వచ్చే మూడేళ్లలో ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తున్నాయి.
రీజినల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్ లోని సంగారెడ్డి నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి వరకు ఉన్న రోడ్డు నిర్మాణ పనులను నాలుగు లేన్ల నుంచి ఆరు లేన్లకు మారుస్తూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, తాజాగా దానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి పెరిగిన అంచనాల ప్రకారం 161.5 కిలో మీటర్ల ఆరు లేన్ల రోడ్డు నిర్మాణానికి రూ.15,627 కోట్లు ఖర్చు చేస్తారు. దీంతో ఎన్ హెచ్ఏఐ అధికారులు టెండర్ ప్రక్రియను మొదలుపెట్టారు. గతంలో ఈపీసీ పద్ధతిలో టెండర్లు పిలవగా, ఇప్పుడు హ్యామ్ మోడల్ లో రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
* జీహెచ్ఎంసీ పరిధి పెద్ద ఎత్తున విస్తరిస్తున్న నేపధ్యంలో హైదరాబాద్ నగరం చుట్టూ సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు.. హై-స్పీడ్ రవాణా కారిడార్ ను ఏర్పాటు చేసేందుకు ట్రిపుల్ ఆర్‌ను.. భారతీమాల–1 ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. నగరం అంతకంతకు విస్తరిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ ను మళ్లించడం, అంతర్రాష్ట్ర కనెక్టివిటీని మెరుగుపరచడం, ఆర్థిక కార్యకలాపాలను పెంపొందించడం, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రహదారులకు అనుసంధానించడం భారతీమాల–1 ప్రాజెక్టు ఉద్దేశం. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి లక్ష్యాలకు తగ్గట్టుగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.
రీజినల్ రింగ్ రోడ్డును రూ.36 వేల కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 343.5 కిలో మీటర్ల పొడవున నిర్మిస్తుండగా రెండు భాగాలుగా విభజించారు. నార్త్ పార్ట్ 161.5 కిలో మీటర్లు, సౌత్ పార్ట్ 182 కిలో మీటర్లుగా డివైడ్ చేశారు. మొదట నార్త్ పార్ట్ పనులు పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ మేరకు ప్రాజెక్ట్ డీపీఆర్ సిద్దం చేశారు. ముందు 4 లేన్స్ తో ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం కోసం రూ.7,104.06 కోట్లతో 2024 డిసెంబర్లోనే టెండర్లు పిలిచారు. ఆ తర్వాత పెరుగుతున్న వాహన రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రిపుల్ ఆర్ రోడ్డును ఆరు లేన్లుగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పెరిగిన అంచనాల ప్రకారం ఆర్ఆర్ఆర్ నార్త్ పార్ట్ రోడ్డు నిర్మాణానికి రూ.15,627 ఖర్చు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆమోదం లభించింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0