వేలం స్థలానికి ఫస్ట్ పేమెంట్ వజ్రా సంస్థ చెల్లించలేదా?
Kokapet Neopolis auction sees record bid, but reports claim Vajra Housing failed to make the first payment for the ₹626 crore plot. HMDA yet to respond.
హెచ్ఎండీఏ కోకాపేట్ నియోపోలిస్‌లో నిర్వహించిన వేలం పాటలు విజయవంతం అయ్యాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నియోపోలిస్‌లో పదిహేడో నెంబర్ ప్లాటును వజ్రా హౌజింగ్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్‌పీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సుమారు 4.59 ఎకరాల విస్తీర్ణం గల ఈ ప్లాటును ఎకరానికి రూ.136.50 కోట్లు పెట్టి వేలంలో సొంతం చేసుకుంది. దీంతో, ఈ ప్లాటు కోసం దాదాపు రూ.626.53 కోట్లను హెచ్ఎండీఏకు చెల్లించాలి. ప్రధానంగా మొదటి విడతలో భాగంగా.. దాదాపు 25 శాతం సొమ్మును హెచ్ఎండీఏకు కట్టడంలో విఫలమైందని సమాచారం. అయితే, ఈ సంస్థ సొమ్ము చెల్లించేందుకు హెచ్ఎండీఏ నుంచి గడువు తీసుకుందా? లేదా? అనే విషయం ఇంకా తెలియలేదు. ఇదే అంశంపై స్పష్టతను తీసుకునేందుకు హెచ్ఎండీఏను ఆర్ఈజీ న్యూస్ సంప్రదించగా.. అధికారులెవరూ స్పందించలేదు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0