ఎకరానికి రూ.151.25 కోట్లతో.. జీహెచ్ఆర్ లక్ష్మీ అర్బన్ బ్లాక్స్ హైదరాబాద్లోనే సరికొత్త రికార్డు..
Hyderabad’s Kokapet Neopolis creates a historic real estate milestone as GHR Lakshmi Urban Blocks secures Plot 15 at a record ₹151.25 Cr per acre. Godrej Properties wins Plot 16 at ₹147.75 Cr. With ₹2708 Cr generated across both rounds, Neopolis strengthens its position as India’s most valuable urban land market.
*ఎకరానికి రూ.151.25 కోట్లతో
* 4.03 ఎకరాల్ని దక్కించుకున్న జీహెచ్ఆర్
* జాతీయ సంస్థలతో పోటీపడి.. ఈ స్థలాన్ని
సొంతం చేసుకున్న జీహెచ్ఆర్ ఎల్ఎల్పీ
* మరో స్థలాన్ని గోద్రెజ్ కైవసం
హైదరాబాద్ వేలం పాటల్లో శుక్రవారం సరికొత్త రికార్డు నమోదు అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక రేటు కోకాపేట్ భూములకు పలికింది. హెచ్ఎండీఏ నిర్వహించిన వేలం పాటలో.. ఎకరానికి నూట యాభై ఒక్క కోట్ల ఇరవై ఐదు లక్షలు పలికింది. ఇది కోకాపేట్‌లోనే ల్యాండ్ మార్క్ ఏరియా అని చెప్పొచ్చు. అందుకే, పలు నిర్మాణ సంస్థలు ఈ స్థలాన్ని దక్కించుకోవడానికి పోటీపడగా ఎట్టకేలకు జీహెచ్ఆర్ దక్కించుకుంది. 4.03 ఎకరాల విస్తీర్ణం గల ప్లాటును జీహెచ్ఆర్ లక్ష్మీ అర్బన్ బ్లాక్స్ గ్రూప్ దక్కించుకుంది. ఎకరానికి రూ.151.25 కోట్లకు ఈ ప్లాట్‌ను లక్ష్మీ నారాయణ గుమ్మడి, కార్తీశ్ రెడ్డి మద్గుల, శరత్ వెంట్రప్రగడ మరియు శ్యామ్ సుందర్ రెడ్డి వంగాల తీసుకున్నారు. 16వ ప్లాటును ఎకరాకు ₹147.75 కోట్ల చొప్పున గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ సొంతం చేసుకుంది. ఈ రెండు ప్లాట్ల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి మొత్తం ₹1352 కోట్లు లభించాయి. మొదటి విడతలో వచ్చిన ఆదాయం కలుపుకుని, ఇప్పటివరకు నియోపొలిస్ వేలం పాటల ద్వారా సమకూరిన మొత్తం విలువ ₹2708 కోట్లకు చేరుకుంది.
ఫైవ్ స్టార్ హోటల్‌తో పాటు బ్రాండెడ్ రెసిడెన్సెస్..
కోకాపేట్ నియోపోలిస్‌లోనే 15వ ప్లాటు టాప్ లొకేషన్‌లో ఉండటం వల్లే ఈ స్థలాన్ని దక్కించుకున్నామని జీహెచ్ఆర్ ఇన్‌ఫ్రా గ్రూప్ ఎండీ శ్యాంసుందర్‌రెడ్డి తెలిపారు. ల్యాండ్‌మార్క్‌గా నిలవడానికి అవకాశం గల ఈ 4.03 ఎకరాల స్థలంలో.. ఫైవ్ స్టార్ హోటల్, బ్రాండెడ్ రెసిడెన్సీస్ కట్టేందుకు ప్రణాళికల్ని రచిస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కోకాపేట్ నియోపోలిస్ ఒక ఫ్యూచరిస్టిక్ లొకేషన్‌గా అవతరిస్తుందని అన్నారు. అందుకే, భవిష్యత్తు తరాలు గుర్తుంచుకునే విధంగా.. అత్యున్నత స్థాయిలో ఇక్కడ రిటైల్, కమర్షియల్ స్పేసెస్‌తో పాటు స్టార్ హోటల్, బ్రాండెడ్ రెసిడెన్సెస్‌ను డెవలప్ చేసేందుకు ప్రణాళికల్ని రచిస్తున్నామని రియల్ ఎస్టేట్ గురుకి ప్రత్యేకంగా వివరించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0