కామ‌న్ ఏరియా కామ్‌గా పెరుగుతోందా?

Hyderabad homebuyers must check carpet area carefully as some builders inflate common areas. Understanding super built-up vs carpet area is key before buying a flat.

Dec 12, 2025 - 12:43
 0  10
కామ‌న్ ఏరియా కామ్‌గా పెరుగుతోందా?
Hyderabad homebuyers must check carpet area

మ‌న‌లో చాలామంది ఫ్లాట్ల‌ను కొంటుంటారు. బిల్డ‌ర్లు చెప్పే సూప‌ర్ బిల్ట‌ప్ ఏరియా ప్రాతిప‌దిక‌న ఎంచుకుంటారు. కాక‌పోతే, రెరా చ‌ట్టం ప్ర‌కారం డెవ‌ల‌ప‌ర్లు కార్పెట్ ఏరియా ప్ర‌కార‌మే ఫ్లాట్ల‌ను విక్ర‌యించాలి. అయితే, ఈ నిబంధ‌న‌ను మ‌న తెలంగాణ రెరా చ‌ట్టం నుంచి తొల‌గించి సేలబుల్ ఏరియాగా పొందుప‌ర్చారు. కొంద‌రు బిల్డ‌ర్లు త‌మ బ్రోచ‌ర్‌లో కార్పెట్ ఏరియా, ప్లింత్ ఏరియా, సూప‌ర్ బిల్ట‌ప్ ఏరియాల గురించి పొందుప‌రుస్తున్నారు. బ‌య్య‌ర్లు గ‌మ‌నించాల్సిన అంశం ఏమిటంటే.. ఐదంత‌స్తుల్లోపు క‌ట్టే అపార్టుమెంట్ల‌లో వెయ్యి చ‌ద‌ర‌పు అడుగుల సూప‌ర్ బిల్ట‌ప్ ఏరియా గ‌ల ఫ్లాటును కొంటే.. అందులో ప‌ద్నాలుగు నుంచి ప‌దిహేను శాతాన్ని మిన‌హాయిస్తే.. 850 నుంచి 860 చ‌ద‌ర‌పు అడుగుల్లో ఫ్లాటే వ‌స్తుంది.

* ఆకాశ‌హ‌ర్మ్యాల్లో ఫ్లాట్ల‌ను కొనేట‌ప్పుడు.. కొంద‌రు బయ్య‌ర్లు ఒక విష‌యాన్ని ప‌క్కాగా గ‌మ‌నించాలి. ఎంత విస్తీర్ణం గ‌ల ఫ్లాటును కొంటున్నారు? నిక‌రంగా ఎంత కార్పెట్ ఏరియా గ‌ల ఫ్లాటు చేతికొస్తుంద‌నే విష‌యాన్ని ప‌రిశీలించాలి. 3000 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణం గ‌ల ఫ్లాట్‌ను కొనుగోలు చేస్తే.. అందులో కార్పెట్ ఏరియా ఎంతొస్తుంద‌నే విష‌యాన్ని నిశితంగా ప‌రిశీలించాలి. కొంద‌రు బిల్డ‌ర్లు ఏం చేస్తున్నారంటే.. కేవ‌లం త‌మ ప్రాజెక్టు అందంగా వచ్చేందుకు.. కామ‌న్ ఏరియాస్‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్లు పెంచేస్తున్నారు. హైరైజ్‌, స్కై స్క్రేప‌ర్ల‌లో ఫ్లాట్ల‌ను కొనుగోలు చేసే వారు ఈ విష‌యాన్ని ప‌క్కాగా గ‌మ‌నించాకే తుది నిర్ణ‌యం తీసుకోవాలి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0