వజ్రం లాంటి ఆఫర్ అని అడుగేస్తే.. ఏమవుతుందో?
A real estate controversy erupts in Hyderabad as a Kokapet project developer reportedly begins selling pre-launch flats at just ₹6,500 per sq.ft—far below market cost and without securing approvals or final floor plans. With HMDA’s role under question, experts warn buyers and investors about the risks of funding a 60-floor skyscraper from a company with no high-rise construction experience. The Hyderabad real estate community is closely watching whether this ambitious project will be completed or collapse financially.
బయ్యర్లు.. బి అలర్ట్..
ఇన్వెస్టర్లూ.. జాగ్రత్త..
అక్రమంగా ఫ్లాట్లను అమ్మడానికి
హెచ్ఎండీఏ పర్మిషన్ ఇచ్చిందా?
కోకాపేట్‌లో ఇటీవల వేలం వేసిన ప్రాజెక్టులో.. భూమిని దక్కించుకున్న ఒక కంపెనీ.. అప్పుడే ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయించడం మొదలు పెట్టిందని సమాచారం. ఇటీవల దస్‌పల్లాలో ఛానెల్ పార్ట్‌నర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి.. ప్రీలాంచ్‌లో ఫ్లాట్ల అమ్మకాన్ని షురూ చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సంస్థ చదరపు అడుక్కీ రూ.6500కే వేడిపకోడిల్లా ఫ్లాట్లను అమ్మే పనిలో పడిందని తెలిసింది. అనుమతి రాక ముందే.. ఫ్లోర్ ప్లాన్స్, ప్రాజెక్టుపై పూర్తి అవగాహన రాక ముందే.. ఫ్లాట్లను విక్రయిస్తుందా? అలా అమ్ముకోవడానికి హెచ్ఎండీఏ ఈ సంస్థకు ఆల్ రైట్స్ ఇచ్చేసిందా? ప్రాజెక్టు పూర్తి చేయకున్నా ఫర్వాలేదు.. తమకైతే ముందే సొమ్ము కట్టేయాలని హెచ్ఎండీఏ అంటోందా?
కోకాపేట్ వేలంలో ఎకరానికి సుమారు రూ.136 కోట్లు పెడితే.. అందులో 60 అంతస్తుల ఆకాశహర్మ్యాన్ని కడితే తప్ప గిట్టుబాటు కాదు. ఒకవేళ అరవై అంతస్తులు కడితే.. భూమి విలువే చదరపు అడుక్కీ రూ.3000 అవుతుంది. నిర్మాణ ఖర్చు చ.అ.కీ.. సుమారు రూ.6000 దాకా వస్తుంది. అనుమతులకు ఫీజులు, కన్సల్టెంట్ల ఛార్జీలు, మార్కెటింగ్ కాస్ట్, ఫైనాన్స్ కాస్ట్ వంటివన్నీ లెక్కిస్తే.. ఎంతలేదన్నా చదరపు అడుక్కీ రూ.2-3 వేలు అవుతుంది. అంటే, ఒక ఫ్లాట్ తుది ధర చదరపు అడుక్కీ రూ.12 వేలు అవుతుంది. మరి, ఈ సంస్థ ప్రీలాంచ్‌లో చదరపు అడుక్కీ రూ.6500కి విక్రయిస్తే.. ఎలా గిట్టుబాటు అవుతుందో వారికే తెలియాలి. ముందు అయితే, ఎలాగోలా హెచ్ఎండీఏకు కట్టాల్సిన సొమ్ము కడితే చాలు.. నిర్మాణం ఎలా కట్టాలనే విషయాన్ని తర్వాత తీరిగ్గా ఆలోచిద్దామని సదరు సంస్థ భావిస్తుందని అనుకుంటా.
* కోకాపేట్‌లో చదరపు అడుక్కీ రూ.6500కు ఫ్లాట్లు లభించడం ఇన్వెస్టర్లకు మంచి ఆఫరే. కాకపోతే, ఆ ప్రాజెక్టు పూర్తవుతుందా? లేదా? అన్నదే ప్రశ్న. మరి, ఈ సంస్థ వద్ద ఎలాంటి మంత్రదండం ఉందో తెలియదు కానీ, హైదరాబాద్ రియల్ రంగమంతా ఈ ప్రాజెక్టు వైపు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే, ఇంతవరకూ హైరైజ్ నిర్మాణాల్ని చేపట్టని సంస్థ.. ఏకంగా అరవై అంతస్తుల ఆకాశహర్మ్యాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుందేమోనని ఆత్రుతగా వేచి చూస్తున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0