రిటైల్ లీజింగ్ జోరు

Retail leasing in India is set to touch 9 million sq ft in 2025 across top cities, driven by rising mall and high street demand, says Cushman & Wakefield.

Dec 26, 2025 - 00:09
 0  11
రిటైల్ లీజింగ్ జోరు
retail-leasing-boom-india-2025-cushman-wakefield-report

-      2025లో 9 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ కార్యకలాపాలు

-      కుష్ మన్ అండ్ వేక్ పీల్డ్ నివేదిక వెల్లడి

దేశంలో ఓ వైపు రిటైల్ స్పేస్ లో పెట్టుబడుల జోరు కొనసాగుతుండగా.. మరోవైపు రిటైల్ లీజింగ్ కూడా అదే స్థాయిలో జోరు ప్రదర్శిస్తోంది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లోని షాపింగ్‌ మాల్స్ లో రిటైల్‌ స్పేస్ కు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ ఏడాది డిమాండ్‌ 15 శాతం పెరిగి 9 మిలియన్‌ చదరపు అడుగులకు చేరుకునే అవకాశం ఉందని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. రిటైలర్ల నుంచి పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా కూడా పెరగనున్నట్టు తెలిపింది. 

2024లో ఇవే నగరాల్లో రిటైల్‌ వసతుల మొత్తం లీజింగ్‌ 7.8 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉందని వివరించింది. ఎనిమిది ప్రధాన నగరాల్లోని హై స్ట్రీట్లలో ఈ ఏడాది రిటైల్‌ వసతుల లీజింగ్‌ 5.4 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉండొచ్చని నివేదిక వెల్లడించింది. 2024లో ఇది 5.3 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉందని తెలిపింది. అలాగే షాపింగ్‌ మాల్స్ లోని రిటైల్‌ దుకాణాల లీజంగ్‌ పరిమాణం 3.8 మిలియన్‌ చదరపు అడుగులకు చేరుకుంటుందని పేర్కొంది. కరోనా తర్వాత ఒక ఏడాదిలో రిటైల్‌ వసతుల అధిక లీజింగ్‌ ఈ ఏడాదే నమోదు కానుందని వివరించింది. వచ్చే ఏడాది కూడా రిటైల్‌ వసతుల సరఫరా మెరుగ్గా ఉంటుందని అంచనా వేసింది. ఈ ఏడాది కొత్త గ్రేడ్‌-ఏ మాల్స్‌ పూర్తి 0.9 మిలియన్‌ చదరపు అడుగులకు పరిమితం కావొచ్చని2025లో కొత్త డెలివరీలు 4.3 మిలియన్‌ చదరపు అడుగులకు చేరుకునే చాన్స్ ఉందని తెలిపింది. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0