రిటైల్ పెట్టుబడుల రయ్ రయ్

India’s retail real estate is set to attract $3.5 billion in investments over the next 3 years, driven by malls, global brands and strong consumer demand, says ANAROCK.

Dec 26, 2025 - 00:07
 0  12
రిటైల్ పెట్టుబడుల రయ్ రయ్
retail-investment-boom-india-anarock-report-3-5-billion

-      రాబోయే మూడేళ్లలో 3.5 బిలియన్ డాలర్లు పెట్టుబడులు

-      అనరాక్ నివేదిక వెల్లడి

రిటైల్ పెట్టుబడులు మనదేశంలో జోరుగా కొనసాగుతున్నాయి. ఓవైపు ఈ కామర్స్ ఎంతగా పెరుగుతున్నా.. మరోవైపు షాపింగ్ మాల్స్ ఆదరణ కూడా అంతే స్థాయిలో జరుగుతోంది. పాశ్చాత్త దేశాల్లో రిటైల్ స్థలాల డిమాండ్ తగ్గిపోతుండగా.. మనదేశంలో అది ఏ మాత్రం చెక్కు చెదరకపోవడం విశేషం. ఇండియాలో మాల్స్‌ కేవలం షాపింగ్‌ కేంద్రాలే కాదు వినోదంఆహారం వంటి సామాజిక అవసరాలను కూడా తీర్చే కేంద్రాలుగా మారాయి. దీంతో మన దేశంలో ఏటేటా రిటైల్‌ స్పేస్‌కు ఆదరణ పెరుగుతోంది. దీంతో గ్లోబల్ పెట్టుబడిదారులు మనదేశం వైపు చూస్తున్నారు. 

అధిక రాబడియువ వినియోగదారుల డిమాండ్సంస్థాగత పెట్టుబడిదారుల్లో విశ్వాసం కారణంగా భారత రిటైల్‌ రంగంలో జోరు పెరిగింది. పరిమిత స్థాయిలో వ్యవస్థీకృత రిటైల్‌ మార్కెట్సరళమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) విధానాలువిదేశీ బ్రాండ్లుపెట్టుబడిదారులు రిటైల్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. వచ్చే మూడేళ్లలో దేశీయ రిటైల్‌ రంగం 3.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందని అనరాక్ తాజా నివేదిక వెల్లడించింది. 2021 నుంచి ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల మధ్యకాలంలో 88కు పైగా విదేశీ బ్రాండ్లు భారత రిటైల్‌ మార్కెట్‌లోకి ప్రవేశించాయి. 

గ్రేడ్‌ఏ మాల్స్‌ కోసం మరిన్ని అన్వేషణలో ఉన్నాయి. మన దేశంలో తలసరి రిటైల్‌ స్టాక్‌ ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది. భారత తలసరి రిటైల్‌ స్టాక్‌ ప్రథమ శ్రేణి నగరాల్లో కేవలం 46 చదరపు అడుగులుగా ఉంది. ద్వితీయతృతీయ శ్రేణి నగరాల్లో 23 చదరపు అడుగులు మాత్రమే. ఇకగ్రేడ్‌ఏ మాల్స్‌లో తలసరి స్థలం కేవలం 0.6 చదరపు అడుగులుగా ఉంది. అమెరికాలో సగటు తలసరి రిటైల్‌ స్థలం 23, చైనాలో 6 చదరపు అడుగులుగా ఉన్నాయి. దేశంలో గ్రేడ్‌ఏ రిటైల్‌ ప్రాపర్టీలు ఏటా 1418 శాతం రాబడి అందిస్తాయి. అదే పాశ్చాత్య దేశాలలో ఈ రాబడి దాదాపు రెట్టింపు స్థాయిలో ఉంటుంది.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0