హైదరాబాద్ లో జేఎల్ఎల్ లీజు

JLL leases 1.2 lakh sq ft office space at Prestige Skytech, Puppalaguda, Hyderabad. Know rent details, lease terms, parking, and Hyderabad commercial real estate trends.

Dec 12, 2025 - 08:36
 0  6
హైదరాబాద్ లో జేఎల్ఎల్ లీజు
jll-office-space-lease-prestige-skytech-puppalaguda-hyderabad

గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్ హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ లీజుకు తీసుకుంది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలో ఉన్న ప్రెస్టీజ్ స్కైటెక్ లోని స్కై వన్ భవనంలో 1.2 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని ఐదేళ్ల కాలానికి లీజుకు తీసుకుంది. 5, 6వ అంతస్తుల్లో ఈ స్పేస్ ఉంది. చదరపు అడుగుకు నెలకు రూ.53 అద్దె చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంది. అంటే నెలకు దాదాపు రూ.64.1 లక్షల అద్దె అవుతోంది. ఇందుకోసం రూ. 3.84 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించింది. ఈ లావాదేవీ గతనెల 28న రిజిస్టర్ కాగా.. లీజు సెప్టెంబర్ 15, 2025న ప్రారంభమైంది. అద్దె మాత్రం ఏప్రిల్ 15, 2026 నుంచి ఐదేళ్ల పాటు ఉంటుంది. అలాగే ప్రతి మూడేళ్లకు ఓసారి అద్దె మొత్తం 15 శాతం పెరుగుతుంది. చదరపు అడుగుకు నెలకు రూ.53 చొప్పున అద్దె ఉండగా.. మెయింటనెన్స్ చార్జీలు నెలకు చదరపు అడుగుకు రూ.13గా ఉంది. ఆఫీస్ స్పేస్ తోపాటు 134 పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. అదనపు పార్కింగ్ స్లాట్‌లను ఒక్కొక్కటి రూ.2,000 చొప్పున లీజుకు తీసుకోవచ్చు. ఈ లావాదేవీకి లీజు ప్రారంభ తేదీ నుంచి మూడు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంది. ప్రెస్టీజ్ స్కైటెక్ హైదరాబాద్ పశ్చిమ కారిడార్‌లోని గ్రేడ్-ఎ వాణిజ్య ప్రాజెక్టులలో ఒకటి. ఈ ప్రాంతం అధిక-నాణ్యత కార్యాలయ స్థలం కోసం చూస్తున్న పెద్ద కంపెనీలను ఆకర్షిస్తూనే ఉంది. "ప్రెస్టీజ్ స్కైటెక్ కు జేఎల్ఎల్ ను స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. ఈ లీజు మా భాగస్వామ్యం యొక్క బలాన్ని మాత్రమే కాకుండా హైదరాబాద్‌లో వేగంగా విస్తరిస్తున్న జీసీసీల ప్రాబల్యానికి నిదర్శనం" అని ప్రెస్టీజ్ గ్రూప్ ఆఫీస్ వెంచర్స్ సీఈఓ జగ్గీ మార్వాహా అన్నారు.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0