మూడు వేల డ్రోన్లతో గిన్నిస్ రికార్డు
Telangana sets a new Guinness World Record with a spectacular 3,000-drone show at the Rising Global Summit, showcasing the state’s Telangana Rising-2047 vision.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన రైజింగ్ గ్లోబల్ సమిట్ ముగింపు వేడుకలో ఏర్పాటు చేసిన భారీ డ్రోన్ షో అందరిని ఆకట్టుకుంది. తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యాలు వివరించే థీమ్ లతో ప్రత్యేక డ్రోన్ షో ఏర్పాటు చేశారు. గిన్నిస్ బుక్ రికార్డు సాధించేలా మొత్తం 3 వేల డ్రోన్లతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. గతంలో అబుదాబిలో 2,131 డ్రోన్ల ప్రదర్శనకు గిన్నిస్ బుక్ రికార్డు వరించింది. తాజాగా దానిని అధిగమించేలా 3 వేల డ్రోన్లతో తెలంగాణ ప్రభుత్వం డ్రోన్ ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ భారీ డ్రోన్ షో అందరిని అబ్బురపరిచింది. ఈ కార్యక్రమానికి హాజరైన గిన్నిస్ వరల్డ్ రికార్డు సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధ్రువపత్రాన్ని అందజేశారు. ముగింపు వేడుకల సందర్భంగా బాణసంచా వెలుగుల్లో గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం కాంతులీనింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0