దుబాయ్ లో ఎన్ బీసీసీ కార్యకలాపాలు షురూ

NBCC has started operations in Dubai by buying mainland land for a mixed-use project, aiming ₹130–135 crore revenue, and also plans a CGO complex near Mumbai Port.

దుబాయ్ లో ఎన్ బీసీసీ   కార్యకలాపాలు షురూ
NBCC has started operations in Dubai by buying mainland land

-      మెయిన్ ల్యాండ్ లో ప్రాజెక్టు కోసం భూమి కొనుగోలు

నేషనల్ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్ బీసీసీ) దుబాయ్ లో తన కార్యకలాపాలు మొదలుపెట్టింది. ఎన్ బీసీసీ ఓవర్ సీస్ రియల్ ఎస్టేట్ ఎల్ఎల్ సీ ద్వారా అక్కడ ప్రాజెక్టులు చేపట్టనుంది. దుబాయ్ మెయిన్ ల్యాండ్ లో 16 మిలియన్ దీర్హమ్స్ తో భూమిని కొనుగోలు చేసింది. మిశ్రమ వినియోగ ప్రాజెక్టును అక్కడ అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్టు మొత్తం 51,718 చదరపు అడుగుల గ్రాస్ ఫ్లోర్ ఏరియా (జీఎఫ్ఏ) కలిగి ఉంది. గ్రౌండ్ + 2 పార్కింగ్ + 8 అంతస్తుల్లో దీనిని నిర్మిస్తారు. తద్వారా 58 నుంచి 60 మిలియన్ దీర్హమ్స్ ఆదాయం రానుందని అంచనా. మరోవైపు ముంబై పోర్టు ల్యాండ్ సమీపంలోని దాదాపు 25 ఎకరాల్లో సీజీఓ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ముంబై పోర్ట్ అథార్టీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఎన్ బీసీసీ తెలిపింది. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0