వ‌ర‌ల్డ్ 100 బెస్ట్ సిటీస్‌లో హైద‌రాబాద్‌కు స్థానం..

Hyderabad secures 82nd rank in the World’s 100 Best Cities 2025 report by Resonance Consultancy & Ipsos. Among four Indian cities listed—Bengaluru, Mumbai, Delhi—Hyderabad stands out for tech growth, infrastructure, and livability. The city also ranks 50th among the World’s Top 100 Tasty Cities.

Dec 2, 2025 - 06:15
 0  138
వ‌ర‌ల్డ్ 100 బెస్ట్ సిటీస్‌లో హైద‌రాబాద్‌కు స్థానం..
Hyderabad-secures-82nd-rank-in-the-World’s-100-Best-Cities

మ‌న హైదరాబాద్ మరోసారి ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచంలోని ఉత్తమ నగరాల జాబితాలో గ్రేటర్ సిటీకి చోటు దక్కింది. మన దేశంలోని నాలుగు నగరాలకు చోటు దక్కగా.. అందులో భాగ్యనగరం ఉండటం విశేషం. రెసోనెన్స్ కన్సల్టెన్సీ, ఇప్సోస్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ కలిసి వరల్డ్స్ బెస్ట్ సిటీస్ రిపోర్టులో భాగంగా మొత్తం 276 నగరాలను పరిశీలించి, ర్యాంకుల‌ను ప్రకటించాయి. ఈ ర్యాంకింగ్స్‌ లో మొత్తం 34 కేటగిరీలను పరిగణనలోకి తీసుకున్నారు. లివబిలిటీ, లవబిలిటీ, ప్రాస్పరిటీ వంటి అంశాలపై విశ్లేషించారు. ఈ జాబితాలో క్యాపిటల్స్ ఆఫ్ క్యాపిటల్ గా పేరున్న లండన్ నగరం వరుసగా 11వ సారి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. రెండవ స్థానంలో న్యూయార్క్, మూడవ స్థానంలో ప్యారిస్, నాలుగవ స్థానంలో టోక్యో, ఐదవ స్థానంలో మాడ్రిడ్, ఆరవ స్థానంలో సింగపూర్, ఏడవ స్థానంలో రోమ్, ఎనిమిదవ స్థానంలో బెర్లిన్ నగరాలు నిలిచాయి. వరల్డ్ బెస్ట్ 100 సిటీస్ లో బెంగళూరు 29 వ స్థానం, ముంబై 40, ఢిల్లీ 54వ స్థానాన్ని దక్కించుకోగా.. మన హైదరాబాద్ 82వ ప్లేస్ లో నిలిచింది.
 
రెసోనెన్స్ కన్సల్టెన్సీ, ఇప్సోస్ మార్కెట్ రీసెర్చ్ బెస్ట్ సిటీస్ సర్వేలో భారత్ లో నాలుగు నగరాలు చోటు దక్కించుకున్నాయి. వాటిలో కర్ణాటక రాజధాని బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. టెక్ ఎకోసిస్టం, విస్తరించిన కార్పొరేట్ బేస్ వల్ల బెంగళూరు 29వ స్థానాన్ని సాధించింది. ఉద్యోగాలు, సాంస్కృతిక కార్యకలాపాలు, ఇన్నొవేషన్ కేంద్రంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై 40వ స్థానంలో నిలిచింది. పొలిటికల్ సినారియో, బెస్ట్ కనెక్టివిటీ, అభివృద్ధి చెందుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా ఢిల్లీ 54వ స్థానాన్ని దక్కించుకుంది. ఇక టెక్నాలజీ విస్తరణ, ఐటీ సేవలు, బయో టెక్నాలజీ, బల్క్ డ్రస్, లైఫ్ సైన్సెస్ కేంద్రంగా ఎదుగుతున్న హైదరాబాద్ 82వ స్థానంలో నిలిచింది. మొత్తానికి చెన్నై, పూణె, అహ్మదాబాద్, కోల్కతా వంటి మెట్రో నగరాలను సైతం పక్కకునెట్టి హైదరాబాద్ ముందంజలో నిలవడంపై రియల్ ఎస్టేట్ సహా పలు రంగాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
 
దీంతో పాటు హైదరాబాద్‌‌కు మరో అరుదైన గౌరవాన్ని సైతం దక్కింది. టాప్ 100 టేస్టీ నగరాల జాబితాలో హైదరాబాద్ సిటీ 50వ స్థానాన్ని దక్కించుకుంది. హైదరాబాద్ కేవలం ఆర్థిక, వ్యాపార, సాంకేతిక కేంద్రంగానే కాకుండా.. ఆహార ప్రియులకు గమ్యస్థానంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. మొఘలాయి, అరబిక్, టర్కిష్ , పర్షియన్ వంటకాలతో హైదరాబాద్ ప్రపంచంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. బిర్యానీ, ఇరానీ చాయ్, హలీమ్, మిర్చీ కా సాలన్, ఉస్మానియా బిస్కెట్ వంటి హైదరాబాద్ స్పెషల్స్ దేశ విదేశాల పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా టేస్టీ అట్లాస్ సంస్థ విడుదల చేసిన ప్రపంచంలోని టాప్ 100 టేస్టీ నగరాల జాబితాలో హైదరాబాద్ 50వ స్థానం సాధించింది. ఈ గుర్తింపు హైదరాబాద్ వంటకాల నాణ్యత, వైవిధ్యంతో పాటు రీజినల్ బుల్ రేట్స్ ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. టేస్టీ అట్లాస్ వంటి ప్లాట్‌‌ ఫామ్‌ ‌లలో హైదరాబాద్ వంటకాలు నిరంతరం ప్రశంసలు అందుకోవడంతో నగరంలో ఫుడ్ కల్చర్ ప్రపంచవ్యాప్తంగా ప్ర‌శంస‌ల్ని అందుకుంటోంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0