ఆకాశహర్మ్యాల్లో అగ్నిప్రమాదం మనమెంత సేఫ్?
Hong Kong high-rise fire kills 94, raising serious concerns about fire safety in Hyderabad’s growing skyscraper landscape. Are our high-rises prepared for disasters?
హాంకాంగ్ హైరైజ్‌లో అగ్ని ప్రమాదం
గాల్లో కలిసిపోయిన 94 మంది ప్రాణాలు
పోలీసుల అదుపులో ప్రెస్టీజ్ కన్‌స్ట్రక్షన్స్
ఇద్దరు డైరెక్టర్లు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్
హాంకాంగ్ అంటేనే అభివృద్ధి చెందిన దేశం.. అక్కడి అకాశహర్మ్యాలు అబ్బురపరుస్తాయి. చూపరుల్ని కనువిందును కలిగిస్తాయి. నిర్మాణ నిబంధనల్ని పక్కాగా పాటిస్తారు. ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్, సిస్టమ్ చురుగ్గా పని చేస్తుంది. తాజాగా అక్కడి హైరైజ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం జరగ్గా.. తొంభై నాలుగు మంది నిట్టనిలువునా కాలిపోయారు. బుధవారం నాడు చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాన్ని పూర్తిగా నియంత్రణలోకి తెచ్చేందుకు.. అక్కడి అగ్నిమాపక శాఖకు ఇరవై నాలుగు గంటలు పట్టింది. సుమారు 4600 మంది దాకా నివసించే వాంగ్ ఫుక్ కోర్ట్ రెసిడెన్షియల్ ఎస్టేట్లో బ్యాంబూ స్కఫోల్డింగ్ మరియు గ్రీన్ మెష్‌ను కట్టి రెనోవేషన్ పనులు జరుగుతుండగా.. ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. టవర్లన్నీ పక్కపక్కనే ఉండటంతో.. ప్రమాద తీవ్రత పెరిగిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి కారణమైన ప్రెస్టీజ్ కన్‌స్ట్రక్షన్స్ ఇద్దరు డైరెక్టర్లు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌ను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.
మరి, ఇప్పుడిప్పుడే మన భాగ్యనగరంలో ఆకాశహర్మ్యాలు పెరుగుతున్నాయి. నలభై అంతస్తుల నిర్మాణాలు సర్వసాధారణం అయ్యాయి. గరిష్ఠంగా అరవై అంతస్తులకు అటుఇటుగా కూడా హెచ్ఎండీఏ అనుమతినిస్తుంది. ఒకవేళ యాభై, అరవై అంతస్తుల ఆకాశహర్మ్యాల్లో అగ్నిప్రమాదం సంభవిస్తే.. మంటల్ని ఆర్పివేసే ఫైరింజన్లు, అంతటి ఆధునిక ఫైర్ ఫైటింగ్ ఎక్విప్‌మెంట్ మన వద్ద ఉందా? అనేది ఇప్పుడు హైదరాబాద్ హోమ్ బయ్యర్లలో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ మన వద్ద ఆకాశహర్మ్యాల్లో ప్రమాదం సంభవిస్తే.. అందులో నుంచి బయటపడొచ్చా? లేక ఆకాశంలోనే ప్రాణాలు పోతాయా అని ఆలోచిస్తున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0