ఏ బ్యాంకు? ఎంత త‌గ్గించింది?

After RBI’s 25 bps repo rate cut, major banks including BOI, Indian Bank, BoB, KVB and BoM reduced home loan rates. Check new rates and impact on borrowers in 2025.

Dec 12, 2025 - 08:50
 0  5
ఏ బ్యాంకు?   ఎంత త‌గ్గించింది?
rbi-repo-rate-cut-bank-wise-home-loan-interest-reduction-2025

రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మరోసారి రేపో రేటు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిండంతో వివిధ బ్యాంకుల నుండి రుణాలు తీసుకునే రుణ గ్రహీతలకు ఉపశమనం కలిగించేది. ఆర్బీఐ ప్రకటన తర్వాత ఐదు ప్రధాన బ్యాంకులు తమ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. బ్యాంకుల నిర్ణయం ద్వారా గృహ రుణాలు సహా వాహన, వ్యక్తిగత రుణాలకు సంబందించిన వడ్డీ రేట్లు మరింత చౌకగా మారాయి. దీని సానుకూల ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై ఉంటుందని రియాల్టీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారతీయ రిజర్వ్ బ్యాంకు తాజాగా 25 బెసిన్ పాయింట్స్ రెపో రేటు తగ్గించంతో అది ఇప్పుడు 5.25 శాతానికి చేరుకుంది. ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ లక్ష్య పరిధి కంటే తక్కువగా ఉండటంతో, ఈ తగ్గింపు అంచనా ఇప్పటికే ప్రారంభమైంది. ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన వెంటనే కొన్ని ప్రముఖ బ్యాంకులు వినియోగదారులకు శుభవార్త చెప్పాయి. రెపో రేటు తగ్గింపు తర్వాత వెంటనే బ్యాంక్ ఆఫ్ ఇండియా తన లింక్డ్ లెండింగ్ రేటు-ఆర్బీఎల్ఆర్ ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అంటే గృహ రుణం 8.35 శాతం నుండి 8.10 శాతానికి దిగివచ్చింది. ఈ కొత్త వడ్డీ రేట్లు డిసెంబర్ 5 నుండి అమల్లోకి వచ్చాయి.

ఇక రెపో రేటు తగ్గింపు ప్రయోజనాన్ని ఇండియన్ బ్యాంక్ తన కస్టమర్లకు అందించడం ప్రారంభించింది. రెపో-లింక్డ్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు ను 8.20 శాతం నుండి 7.95 శాతానికి తగ్గించింది. అంతే కాకుండా ఇండియన్ బ్యాంక్ తన కస్టమర్ల కోసం మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. కొత్త రేట్లు డిసెంబర్ 6 నుండి అమలులోకి వస్తాయి. ఆర్బీఐ రెపో రేటును తగ్గించాలనే నిర్ణయంపై స్పందించిన బ్యాంక్ ఆఫ్ బరోడా , తన రుణ వడ్డీ రేట్లను వెంటనే తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో బ్యాంక్ ఆఫ్ బరోడా రెపో ఆధారిత రుణ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో గృహ రుణాలపై 8.15 శాతం నుండి 7.90 శాతానికి తగ్గింది. డిసెంబర్ 6 నుండి అమలులోకి వచ్చేలా ఈ కొత్త వడ్డీ రేట్లను బ్యాంక్ అమలు చేసింది.

కరూర్ వైశ్యా బ్యాంక్ కూడా తన కస్టమర్లకు అన్ని కాలపరిమితి గల మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ తగ్గింపును ప్రకటించింది. ఈ ప్రైవేట్ రంగ బ్యాంక్ తన ఎమ్ సీఎల్ఆర్ ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అంటే గృహ రుణాలపై వడ్డీ రేటు 9.55 శాతం నుండి 9.45 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. కొత్త రేట్లు డిసెంబర్ 7 నుండి అమలులోకి వచ్చాయి. ఆర్బీఐ రేటు తగ్గింపుకు అనుగుణంగా, గృహ రుణాలు , వాహన రుణాలు, విద్యా రుణాలు మరియు రెపో-లింక్డ్ లెండింగ్ రేటుతో అనుసంధానించబడిన ఇతర రుణాలు సహా రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల తగ్గింపును బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రకటించింది. గృహ రుణాలు 7.10 శాతం నుండి, వాహన రుణాలు 7.45 శాతం నుండి ప్రారంభమవుతాయని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తెలిపింది.

ప్రస్తుతం అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో చూస్తే హోం లోన్ వడ్డీ రేట్లు 7.90 శాతం నుంచి 13.20 శాతంగా ఉన్నాయి. ఇప్పుడు 25 బేసిస్ పాయింట్లు తగ్గితే అది 7.65 నుంచి 12.95 శాతానికి చేరుతుంది. ఐసీఐసీఐ బ్యాంకులో ఈబీఎల్ఆర్ 9.20 శాతంగా ఉంది. ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గిస్తే ఇది 8.75 నుంచి 9.8 శాతానికి చేరుతుంది. కోటక్ మహీంద్రా బ్యాంకులో 7.99 నుంచి 13.3 శాతంగా హోం లోన్ వడ్డీ రేట్లు ఉన్నాయి. యాక్సిస్ బ్యాంకులో వడ్డీ రేట్లు ప్రస్తుతం 8.35 నుంచి 9.35 శాతం మధ్య ఉన్నాయి. ఎస్బీఐలో హోం లోన్ వడ్డీ రేటు 7.5 శాతం నుంచి 8.7 శాతంగా ఉంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ రేట్లు 7.45 నుంచి 10 శాతంగా, కెనరా బ్యాంకులో 7.40-10.25 శాతంగా ఉన్నాయి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0