కోటీ గృహ రుణంపై ఈఎంఐ ఎంత తగ్గుతుంది?

RBI cuts repo rate by 25 bps, reducing home loan interest to around 7.1%. Know how much EMI drops on a ₹1 crore home loan and its impact on middle-class buyers.

Dec 12, 2025 - 08:46
 0  4
కోటీ గృహ రుణంపై   ఈఎంఐ ఎంత తగ్గుతుంది?
home-loan-emi-reduction-rbi-repo-rate-cut-1-crore-loan

సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. సామాన్యుల నుంచి మధ్య తరగతి, ధనిక వర్గాల వరకు ఎవరి బడ్జెట్ కు అనుగునంగా ఎక్కడో ఓ చోట సొంత ఇల్లు కొనుక్కోవాలని కోరుకుంటారు. ఇక సొంతింటి కోసం నూటికి 99 శాతం మంది బ్యాంకు లోన్ తీసుకుంటారు. అయితే సామాన్య, మధ్య తరగతి వారికి ఇంటి రుణంపై ప్రతి నెల ఈఎంఐ చెల్లించడం భారంతో కూడుకున్న వ్యవహారం. ఇటువంటి సమయంలో ఆర్బీఐ రేపో రేటును 25 శాతం బేసిన్ పాయింట్స్ తగ్గించడంతో అది 5.25 శాతానికి చేరింది. దీంతో గృహ రుణ గ్రహీతలకు వడ్డీ రేట్లు తగ్గడంతో ఈఎంఐల కొంతమేర తగ్గుతుంది. అందుకే బ్యాంక్ లోన్ కు సంబంధించిన‌ ఈఎంఐని త్వరిగతిన చెల్లించి కాలపరిమితి కంటే ముందే రుణాన్ని తీర్చగలితే పలు మార్గాలను సూచిస్తున్నారు ఆర్ధిక రంగ నిపుణులు.

ఇంటి కొనుగోలు కోసం చాలామంది బ్యాంకుల నుంచి హోమ్‌ లోన్‌ తీసుకుంటారు. ఇంటి రుణాన్ని సాధారణంగా 15 నుంచి 20 సంవత్సరాలలో నెమ్మదిగా తిరిగి చెల్లించేద్దామని అనుకుంటారు. అది తక్కువ వేతనం, ఆదాయం ఉన్న వారికి కొంత కష్టతరమైన విషయమే. ఇటువంటి సమయంలో గృహ రుణ గ్రహీతలకు భారతీయ రిజర్వ్ బ్యాంకు శుభవార్త చెప్పింది. తాజాగా రిజర్వ్ బ్యాంకు మరో 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించడంతో ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ లెండింగ్‌ రేటుతో ముడిపడిన గృహ రుణాల ఈఎంఐ భారం తగ్గనుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు నాలుగు సార్లు ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించింది. గత సంవత్సరం వరకు గృహ రుణాలపై ఉన్న 9 శాతం ఉన్న వడ్డీ రేట్లు ఇప్పుడు బ్యాంకును బట్టి 7.1 శాతం నుంచి 7.5 శాతానికి దిగిరానున్నాయి. దీనివల్ల ప్రస్తుతం గృహ రుణం తీసుకున్నవారితో పాటు భవిష్యత్తులో దీర్గకాలం పాటు ఇంటి రుణం పొందేవారికి పెద్దమొత్తంలో ప్రయోజనం చేకూరనుంది.

ఆర్బీఐ నిర్ణయంతో సామాన్య, మధ్య తరగతి వారికి భారీ ఊరట లభించింది. గృహ రుణాలతో పాటు వాహన రుణాలు, వ్యక్తిగత రుణాల ఈఎంఐలు తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వంటి అనేక బ్యాంకులు 7.35 శాతంకే గృహ రుణాలను అందిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్‌బిఐ వడ్డీ రేటును తగ్గించిన నేపధ్యంలో బ్యాంకులు అందించే గృహ రుణాల రేటు కూడా దాదాపు 7.1 శాతానికి తగ్గే అవకాశం ఉంది. గృహ రుణాలకు సంబందించిన ఈఎంఐలు ఎంత తగ్గుతాయానేది పరిశీలిస్తే.. మీరు 15 సంవత్సరాలకు 1 కోటి రూపాయల గృహ రుణం తీసుకున్నారని అనుకుందాం. రిజర్వ్ బ్యాంకు నిర్ణయం ప్రకారం.. ఈ రుణంపై వడ్డీ రేటు 0.25 శాతం తగ్గిస్తే, మీ నెలవారీ ఈఎంఐ దాదాపు రూ.1,440 వరకు తగ్గించవచ్చు. అంటే ఏడాదికి 17,280 రూపాయల ఈఎంఐ తగ్గుతుంది. ఇది సామాన్యులకు ఎంతో ఉపశమనం కలిగించే విషయమని చెప్పవచ్చు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0