స్టాంపు డ్యూటీ సర్దుబాటుపై క్రెడాయ్ చెన్నై హర్షం..

CREDAI Chennai welcomes Tamil Nadu government's decision to allow stamp duty and registration fee adjustment, giving first-time home buyers relief up to ₹6 lakh.

Dec 26, 2025 - 21:44
 0  9
స్టాంపు డ్యూటీ సర్దుబాటుపై   క్రెడాయ్ చెన్నై హర్షం..
CREDAI Chennai welcomes Tamil Nadu government's decision

తమిళనాడులో గత రిజిస్ట్రేషన్ ఫ్రేమ్‌వర్క్ కింద ఇప్పటికే చెల్లించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను సర్దుబాటు చేసుకోవడానికి గృహ కొనుగోలుదారులను అనుమతించాలనే తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని క్రెడాయ్ చెన్నై స్వాగతించింది. ఇది గృహ రంగంలో దీర్ఘకాలిక పన్ను సమస్యలను పరిష్కరించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొంది. 

కాంపోజిట్ రిజిస్ట్రేషన్ వ్యవస్థకు మారుతున్న సమయంలో అనేక మంది గృహ కొనుగోలుదారులు ఎదుర్కొంటున్న డబుల్ టాక్సేషన్ సమస్యను ప్రభుత్వ ఉత్తర్వు సమర్థవంతంగా పరిష్కరిస్తుందని క్రెడాయ్ చెన్నై అధ్యక్షుడు మొహమ్మద్ అలీ అన్నారు. అర్హులైన కొనుగోలుదారులందరికీ ఈ ప్రయోజనాలు చేరేలా దీనిని సరిగా అమలు చేయాలని కోరారు. 2023 డిసెంబర్ ఒకటో తేదీకి ముందు నమోదైన నిర్మాణ ఒప్పందాలపై ఇప్పటికే చెల్లించిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను కాంపోజిట్ సేల్ డాడ్ రిజిస్ట్రేషన్ సమయంలో సర్దుబాటు చేసుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం అంగీకరించింది. తొలిసారి ఇల్లు కొంటున్నవారికి ఈ ప్రయోజనం వర్తిస్తుంది. ఇప్పటివరకు ఈ విధానం లేకపోవడం డబుల్ టాక్సేషన్ సమస్య ఉత్పన్నమైంది. దీనిని నివారిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మొదటిసారి గృహ కొనుగోలుదారులు ప్రాపర్టీ విలువ మరియు నిర్మాణ ఒప్పందాన్ని బట్టి సగటున రూ.2 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ప్రయోజనం పొందుతారు. అయితే, ఈ ప్రయోజనం పొందాలంటే కొనుగోలుదారులు అందుకు సంబంధించిన ఆధారాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించిన తర్వాతే స్టాంపు డ్యూటీ ఎంత తగ్గుతుందో అధికారులు నిర్ధారిస్తారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0