పెరగనున్న ఇళ్ల ధరలు
India home prices may rise up to 5% next year, says CREDAI-CRE Matrix survey. 68% developers expect higher prices and rising demand in residential real estate.
- వచ్చే ఏడాది 5 శాతం వరకు పెరిగే అవకాశం
- క్రెడాయ్-సీఆర్ఈ మ్యాట్రిక్స్ సర్వే వెల్లడి
దేశంలో వచ్చే ఏడాది ఇళ్ల ధరలు పెరగనున్నాయి. ప్రధాన నగరాల్లోని గృహాల ధరలు 5 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని డెవలపర్లు అంచనా వేస్తున్నారు. క్రెడాయ్- సీఆర్ఈ మ్యాట్రిక్స్ చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. నవంబర్, డిసెంబర్ మధ్య నిర్వహించిన ఈ సర్వేలో 647 మంది డెవలపర్లు పాల్గొన్నారు. క్రెడాయ్ సదస్సులో ఈ నివేదికను విడుదల చేశారు. వచ్చే క్యాలెండర్ సంవత్సరంలో ఇళ్ల ధరలు 5 శాతానికి మించి పెరుగుతాయని 68 శాతం మంది అభిప్రాయపడ్డారు.
పెరుగుదల 25 శాతానికి మించి ఉంటుందని 1 శాతం మంది, 15-25 శాతం మధ్య ఉంటుందని 3 శాతం మంది అంచనా వేశారు. ఇక ఇళ్ల ధరలు 10-15 శాతం మధ్యలో పెరుగుతాయని 18 శాతం మంది, 5-10 శాతం మేర పెరుగుతాయని 46 శాతం మంది పేర్కొన్నారు. రేట్లు తగ్గుతాయని 8 శాతం మంది మాత్రమే తెలపగా, ధరల పెరుగుదల 5 శాతం లోపే ఉంటుందని అంచనా వేస్తున్నట్లు సుమారు 25 శాతం మంది వివరించారు. 2026లో రెసిడెన్షియల్ సెగ్మెంట్ సానుకూలంగా ఉంటుందని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. ఇళ్లకు డిమాండ్ కూడా 5 శాతం మేర పెరిగే అవకాశం ఉందని అంచనా. వచ్చే ఏడాది రియల్ ఎస్టేట్ రంగ వృద్ధి ప్రధానంగా వినియోగదారుల డిమాండ్‌ను బట్టే ఉంటుందే తప్ప స్పెక్యులేషన్ ఆధారితమైనదిగా ఉండదని క్రెడాయ్ ప్రెసిడెంట్ శేఖర్ జి. పటేల్ తెలిపారు. టెక్నాలజీ వినియోగంతో ఖర్చులను తగ్గించి, కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా ప్రాపర్టీలను అందించడంపై పరిశ్రమ మరింతగా దృష్టి పెడుతోందని వివరించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0